![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -297 లో.. దుగ్గిరాల ఫ్యామిలీలోని అందరు సరదాగా హాల్లో పడుకొని కబుర్లు చెప్పుకుంటు ఉంటారు. అదే సమయంలో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతారు. అందులో రాజ్ వంతు రాగా కావ్యకి ప్రపోజ్ చెయ్యాలని కళ్యాణ్ చెప్తాడు. దాంతో రాజ్ ఇబ్బంది పడిన ప్రపోజ్ చేస్తాడు. కావ్యకి రాజ్ ఎర్రగులాబీ ఇచ్చి నుదిటిపై ముద్దు పెట్టి ప్రపోజ్ చేస్తాడు. దాంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత అందరూ హాల్లోనే పడుకుంటారు. అందరు పడుకున్నారని అనుకొని.. అనామిక దగ్గరకి కళ్యాణ్ వెళ్లి బయటకు తీసుకొని వచ్చి మాట్లాడుతాడు. అందరూ లేచి.. కళ్యాణ్ , అనామిక ల దగ్గరకి వచ్చి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటారు. అనామికకు ఒక్కొక్కరి గురించి కళ్యాణ్ చెప్తూ ఉంటే అందరు కళ్యాణ్ పై కోపంగా ఉంటారు. ఈ ఇంట్లో రాక్షసి సుర్పనక అన్ని మా అత్తయ్య రుద్రాణి అనగానే రుద్రాణి కోపం తట్టుకోలేక ఒరేయ్ మీరు మీరు మాట్లాడుకుంటే నా గురించి ఎందుకని అనగానే కళ్యాణ్, అనామిక ఇద్దరు వాళ్ళని చూసి షాక్ అవుతారు. వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదు త్వరగా శోభనం చేసెయ్యాలని అపర్ణ అంటుంది. మరుసటిరోజు ఉదయం కావ్య కిచెన్ లోకి రాకముందే అనామిక వచ్చి కాఫీ చేస్తుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ నేను చేస్తాను కాదా అని కావ్య అనగానే నీకు బాధ్యతలు ఉన్నప్పుడు నాక్కూడా ఉంటాయి కదా అని అనామిక కోపంగా అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు వస్తారు. నువ్వు చాలా గ్రేట్ అపురూపంగా పెరిగిన కూడా నువ్వు ప్రొద్దున లేచి అందరికి కాఫీ పెడుతున్నావంటూ అనామికని రుద్రాణి పొగుడుతుంది. నా కోడలు అంటే ఏమనుకున్నావ్.. ఎవరికి అన్యాయం చెయ్యకుండా ఉంటే సరిపోద్ధని కావ్య వైపు చూస్తూ అనామికని పొగుడుతుంది.
ఆ తర్వాత నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు.. నీకు హెల్ప్ చేస్తానని అనామికతో ధాన్యలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక టీని కూడా కాఫీ చేసినట్లు చేస్తుంటుంది. అలా కాదని కావ్య చెప్తుంటే అనామిక వినదు.. అ తర్వాత అందరు కాఫీ తాగి.. అదొక రకమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తుంటారు. అనామిక ఫీల్ అవుతుందని అందరు బాగుందని చెప్తారు. అ తర్వాత కళ్యాణ్ వచ్చి తాగి బాలేదని చెప్పగానే అనామిక తాగి తాను కూడ బాలేదని అంటుంది. కాసేపటికి అందరు కావ్యని మళ్ళీ టీ చేసి తీసుకొని రమ్మని చెప్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |